అర్జున్ సమాచారం:
గోదావరిఖని:
గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ మండపాలను గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సీఐ కృష్ణకుమార్‌తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ నిర్వాహకులతో మాట్లాడి, ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.
అనంతరం ఏసీపీ ఎం.రమేష్ మాట్లాడుతూ, 23-09-2026 బుధవారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రలో నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
నిర్వాహకులకు ముఖ్య సూచనలు
నిమజ్జన శోభాయాత్రలో పోలీసులు సూచించిన మార్గం, సమయాలను తప్పనిసరిగా పాటించాలి.
శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
డీజేలకు అనుమతి లేదు. నిబంధనలకు అనుగుణంగా మాత్రమే సౌండ్ సిస్టమ్‌ను వినియోగించాలి.
సౌండ్ సిస్టమ్ వినియోగంలో నిర్దేశిత సమయ పరిమితులను తప్పనిసరిగా పాటించాలి.. శోభాయాత్రలో అశ్లీల, రెచ్చగొట్టే పాటలు లేదా నినాదాలు చేయరాదు.
గణేష్ మండపాలు, శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో విద్యుత్ భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలి.. శోభాయాత్రలో పాల్గొనే యువత మద్యం సేవించి పాల్గొనరాదు.
గణేష్ విగ్రహాలను తరలించే వాహనాలపై అధిక సంఖ్యలో వ్యక్తులు,చిన్న పిల్లలు ఎక్కకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి.
నిమజ్జనం సందర్భంగా పోలీసులు, ఇతర శాఖల సిబ్బందికి నిర్వాహకులు పూర్తిగా సహకరించాలి.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే లేదా అవాంఛనీయ ఘటనలకు దారితీసే చర్యలకు పాల్పడకుండా సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించాలి.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా గణేష్ ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఏసీపీ ఎం.రమేష్ కోరారు.